ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే కేంద్ర నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం వదిలిపోతుంది. 

బ్లాక్ కాఫీ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుంది. 

పాలు, పంచదార లేని బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో సహాయపడతుంది. బ్లాక్ కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో బ్లాక్ కాఫీ ఎంతో చక్కగా పని చేస్తుంది.  ఫ్యాటీ లివర్, హైపటైటిస్, కాలేయ క్యాన్సర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని ఘననీయంగా తగ్గిస్తుంది. 

బ్లాక్ కాఫీలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పలు రకాల విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 

బ్లాక్ కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థ చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. 

ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెటబాలిజమ్ మెరుగుపడుతుంది. శరీరంలోని జీవ క్రియలన్నీ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. 

రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువ బ్లాక్ కాఫీ తాగడం మాత్రం ప్రమాదం. నిద్ర డిస్ట్రబ్ అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు మొదలవుతాయి.