ఉదయాన్నే క్వినోవా రైస్ తింటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?

వరి బియ్యంతో పోల్చుకుంటే క్వినోవా రైస్‌లో ఎన్నో ముఖ్యమైన పోషకాలుంటాయి. ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్ వంటి కీలక పోషకాలు క్వినోవాలో పుష్కలంగా ఉంటాయి. 

మహిళలు గర్భధారణ సమయంలో క్వినోవా రైస్ తీసుకుంటే పిండం ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. కడుపులోని బిడ్డకు అన్ని పోషకాలూ అందుతాయి.

క్వినోవా రైస్ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె సంబంధ సమస్యలు దూరమవుతాయి. 

మన శరీరంలో ఉత్పత్తి కాలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు క్వినోవా రైస్‌లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. 

క్వినోవా రైస్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటోన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. 

బరువు తగ్గాలనుకునే వారికి క్వినోవా మంచి ఎంపిక. ఉదయాన్నే క్వినోవా రైస్‌తో చేసిన వంటకం తింటే రోజంతా కడుపు నిండినట్టు ఉంటుంది. 

క్వినోవాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 

క్వినోవాలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.