అంజీరాతో షుగర్‌కే కాదు.. ఈ వ్యాధులకూ చెక్ పెట్టొచ్చు!

అంజీరాలో పొటాషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అలాగే ఇవి లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యమైన ఆహారం.

లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వారికి అంజీరాలు దివ్య ఔషధం అనే చెప్పాలి. రాత్రి పాలలో నానబెట్టిన అంజీరాలను ఉదయాన్నే తినాలి.

మన శరీరంలో పొటాషియం తక్కువగా, సోడియం ఎక్కువగా ఉంటే బీపీ పెరుగుతుంది. అంజీరాలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. వీటిని తింటే బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.

రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీరాను ఉదయాన్నే తింటే ఫైల్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ అంజీరాలో పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘ వ్యాధులకు చెక్ పెడతాయి.

అంజీరాల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆస్టియోపోరిస్ వంటి ఎముకల వ్యాధి దరి చేరదు.

దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలకు డ్రై అంజీరాలు చెక్ పెడతాయి.

మలబద్దకంతో బాధపడుతున్న వారు అంజీరాలు తింటే సరిపోతుంది. వీటిలో హెచ్చు స్థాయిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పోటాషియంతో పాటు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె వంటివి అంజీరాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి