ఐస్‌బాత్ వల్ల కలిగే ప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
ఒత్తిడి బాగా ఎక్కువైనపుడు నాడీ వ్యవస్థను వాగస్ నాడి నియంత్రిస్తుంది. మంచు నీటితో స్నానం చేయడం వల్ల ఆ వాగస్ నాడి పనితీరు మెరుగవుతుంది.
కండరాల నొప్పిని తగ్గించడంలో ఐస్ వాటర్ సహాయం చేస్తుంది. ముఖ్యంగా కండరాలకు బాగా ఉపశమనం కలిగిస్తుంది.
చల్లటి ఉష్ణోగ్రత మీ రక్తనాళాలను కొద్ది సేపు సంకోచింపచేస్తుంది. ఫలితంగా కండరాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఐస్ బాత్ చేసిన తర్వాత మీ రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. కండరాలలో పేరుకుపోయిన జీవ క్రియ వ్యర్థాలు తొలిగిపోతాయి.
శరీరం చల్లదనం నుంచి వెచ్చగా మారే ప్రక్రియ మెటబాలిజమ్‌ను వేగవంతం చేస్తుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
మీ శరీరం ముంచు ముక్కల మధ్యకు వెళ్లినపుడు అడ్రినలిన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఈ హార్మోన్లు మీ మూడ్‌ను ఉత్సాహంగా మారుస్తాయి.
రోజువారీ జీవితంలో ఎదురయ్యే స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ బాత్ చక్కని ఆయుధం. ఐస్‌బాత్ వల్ల ఒత్తడిని సమర్థంగా ఎదుర్కొనే హార్మోన్లు విడుదలవుతాయి.
ఐస్ బాత్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఐస్‌బాత్ సహకరిస్తుంది.
Related Web Stories
అనంత్ అంబానీ.. 108 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..
పుల్కాలను నేరుగా స్టవ్ మీద కాలుస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
ఉదయం పరగడుపున అస్సలు తినకూడని 5 డ్రై ఫ్రూట్స్!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే..