మామిడి ఆకులను చాలా కాలంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. మామిడి ఆకులు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
హైబీపీతో బాధపడుతున్న వారికి మామిడి ఆకులు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేకమైన యాంటీ-ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించగలవు.
మామిడి ఆకులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పలు పరిశోధనలు రుజువు చేశాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు మామిడి ఆకులను నమిలితే చాలా మంచిది.
మామిడి ఆకులు కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అలాగే వీటిల్లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
యాంటీ-ఆక్సిడెంట్లు మామిడి ఆకులలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటి కారణంగా చర్మ ఆరోగ్యానికి మామిడి ఆకులు మంచి మందు.
ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి, కడుపులో అల్సర్లను తగ్గించుకోవడానికి ఆయుర్వేదం ప్రకారం మామిడి ఆకులనే ఉపయోగిస్తుంటారు.
మామిడి ఆకులు శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించగలవు. బరువు తగ్గాలనుకునే వారు మామిడి ఆకులు తీసుకోవాలి.
మామిడి ఆకులు యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచుతాయి.