ఉప్పును తగ్గించడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు తగ్గితే హృదయ సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో నీరు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఫలితంగా రక్త పరిమాణం పెరిగి దానిని పంప్ చేసేందుకు గుండె ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.
శరీరంలో సోడియం సమతుల్యతను కాపాడే పని కిడ్నీలది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బ తింటాయి. కిడ్నీల్లో రాళ్లు పేరుకుపోతాయి.
సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరరీంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, వాపు వంటి సమస్యలు మొదలవుతాయి.
అధిక రక్తపోటు వల్ల బీపీ పెరిగిపోతుంది. ఫలితంగా స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బోలుగా మారిపోతాయి. ఉప్పు వల్ల ఎముకల వ్యాధి, ఎముక పగళ్లు వస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
అధిక ఉప్పు కలిగిన ఆహారాలు అధిక క్యాలరీలను కలిగి ఉంటాయి. ఇవి అధిక బరువుకు కారణమవుతాయి.
ఉప్పు ఆహారంలోని కొన్ని పోషకాలను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే సహజ రుచులను గ్రహించకుండా చేస్తుంది.