ఉల్లిని ఉపయోగించినంత విరివిగా ఉల్లి కాడలను చాలా మంది వినియోగించరు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌ను జపాన్, చైనా వాసులు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
రక్తపోటుకు ఉల్లి కాడలు దివ్యమైన ఔషధం. ఉల్లిపాయలతో పోల్చుకుంటే ఉల్లి కాడల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
ఉల్లి కాడల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేన్సర్ రాకుండా నియంత్రిస్తుంది.
ఫైల్స్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు సరైన మందు. ఉల్లి కాడలు తరచుగా తింటే పైల్స్ వల్ల వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయి.
ఉల్లి కాడల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే బరువును నియంత్రణలో ఉంచుతుంది.
ఉల్లికాడల్లో గ్జియాంతిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే ఆస్టియోపోరిస్ వంటి ఎముకల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఉల్లికాడల్లోని క్యామెఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది
జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉల్లికాడలతో సూప్ పెట్టుకుని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.