కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!

కాల్షియం శరీరానికి చాలా అవసరం.  కాల్షియం లోపిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కాల్షియం లోపం ప్రారంభంలో చాలామంది ఎదుర్కునే సమస్య అలసట.

దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు కాల్షియం లోపం ఉన్నవారిలో ఉంటాయి.

కాల్షియం లోపం ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన ప్రాణాంతకమైన వెంట్రిక్యులర్ అరిథ్మియాకు దారితీస్తుంది.

కండరాల నొప్పులు,  శరీరం నొప్పులు, కండరాలు దృఢంగా లేకపోవడం కాల్షియం లోపం లక్షణాలే.

నరాల పనితీరులో ఇబ్బందులు. చేతులు, పాదాలు, కాలిలో తిమ్మిర్లు,  జలధరింపులు  కాల్షియం లోపం వల్ల వస్తాయి.

జ్ఞాపకశక్తి కోల్పోవడం,  ఆందోళన,  విశ్రాంతి  లేకపోవడం, నిరాశ, భ్రాంతులు, అయోమయ స్థితి వంటి అనేక సమస్యలు కాల్షియం లోపం వల్ల వస్తాయి.

కాల్షియం లోపం ఉంటే   గోర్లు, జుట్టు పొడిబారి పెళుసుగా మారుతాయి.  చర్మం పొలుసులుగా మారుతుంది.