ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా గురించి మీకు తెలియని నిజాలివీ..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.

దీని ఎత్తు 828మీటర్లు. అంటే 2,716.5అడుగుల ఎత్తు. ఇందులో 160కంటే ఎక్కువ అంతస్తులున్నాయి.

ఈ భవన నిర్మాణం కోసం తవ్వకం పని 2004లో మొదలైంది. అధికారికంగా 2010లో ప్రారంభమైంది.

బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో ప్రపంచం నలుమూలల నుండి 12వేల మంది పాల్గొన్నారు.

భవనం బయట క్లాడింగ్ లో 26వేల గాజు పలకలు ఉపయోగించారు. ఇవన్నీ చేత్తో కత్తిరించినవే.

బుర్జ్ ఖలీఫా అనేది ఒక హోటల్.  కార్పోరేట్ సూట్లు, ప్రైవేట్ అల్ట్రా-లగ్జరీలో వసతి ఉంటుంది.

బుర్జ్ ఖలీఫా భవనం పై నుండి కిందికి శుభ్రం చేయడానికి సుమారు 3నెలల సమయం పడుతుంది.

ఈ బిల్డింగ్ లో గాలి ప్రభావం తక్కువ ఉండటానికి వై ఆకారపు క్లాస్ సెక్షన్ తో దీన్ని రూపొందించారు.

504 మీటర్ల ఎత్తైన ఎలివేటర్ ఉంది. ఇందులో 441మీటర్ల ఎత్తైన రెస్టారెంట్ కూడా ఉంది.