వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు  చాలా హెల్తీ..!

మద్యపానం ఆరోగ్యానికి  హానికరం అంటారు.  అయితే కొన్ని రకాల మద్యం మితంగా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట.

రెడ్ వైన్.. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు,  పాలీఫెనాల్స్, రెస్వెరాట్రాల్ సమృద్దిగా ఉంటాయి. దీన్ని మితంగా తీసుకుంటే  కొలెస్ట్రాల్ ను గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

షాంపైన్.. షాంపైన్ లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. దీన్ని మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యం,   మెదడు పనితీరు మెరుగవుతుంది.

టేకిలా.. కలబందను పోలి ఉండే ఆగావే అనే మొక్క నుండి టేకిలా  మద్యం తయారుచేస్తారు. ఇందులో ఫ్రక్టాన్లు ఉంటాయి.  ఇవి జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

విస్కీ.. యాంటీ ఆక్సిడెంట్లు,  ఎల్లాజిక్ యాసిడ్ విస్కీలో సమృద్దిగా ఉంటాయి.  మితంగా తీసుకుంటే వాపును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది

జిన్.. జుని పెర్ బెర్రీలతో తయారయ్యే ఈ మద్యాన్ని మితంగా తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది.   యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి.

లైట్ బీర్.. సాధారణ బీర్ తో పోలిస్తే తేలికపాటి బీర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి.  కార్బోహైడ్రేట్ ఉంటుంది.  మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది.

సేక్.. పులియబెట్టిన బియ్యంతో  దీన్ని తయారుచేస్తారు.  జపనీస్ కు చెందిన ఈ ఆల్కహాల్ లో యాంటీ  ఆక్సిడెంట్లు ఎక్కువ.  గుండె ఆరోగ్యాన్ని, వాపులను తగ్గిస్తుంది.