పోచంపల్లి..పోచంపల్లి చీరలు చాలా ప్రసిద్ధి. ఇక్కడి కళను గుర్తించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో భాగంగా యునెస్కో గుర్తించింది. గ్రామం చుట్టూ ప్రకృతి మైమరిపిస్తుంది.
కొండపోచమ్మ..
కొండపోచమ్మ గ్రామం రిజర్వాయర్ సమీపంలో ఉంది. ఇక్కడ సూర్యాస్తమయాన్ని తప్పక చూడాల్సిందే. పకృతి కట్టిపడేస్తుంది.
వేములవాడ..
వేములవాడలో చారిత్రక దేవాలయం ఉంది. చుట్టూ పచ్చని పొలాల మధ్య అద్బుతంగా ఉంటుంది.
చెర్యాల్..
ఈ గ్రామం జానపద కళలు, కళాకారులకు, స్క్రోల్ పెయింటింగ్ కు ప్రసిద్ధి. గ్రామం చుట్టుప్రక్కల పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది.
అనంతగిరి..
వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ ప్రియులకు బెస్ట్ ప్లేస్. ఇది తెలంగాణలో అందమైన గ్రామాల్లో ది బెస్ట్..
మెదక్..
మెదక్ కోట, దీని చుట్టూ ఉండే ప్రకృతికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వన్యప్రాణుల అభయారణ్యలకు ఇది నిలయం.
పెంబర్తి..
పెంబర్తి ఇత్తడి వస్తువులకు పేరుగాంచింది. గొప్ప కళాత్మక వారసత్వం ఈ గ్రామంతో ముడిపడి ఉంటుంది.
నగునూర్..
నగునూర్ గ్రామంలో పురాతన ఆలయాల శిథిలాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం చరిత్రతో ముడిపడి ఉంది.
కోటగిరి..
కోటగిరి తమిళనాడును పోలి ఉంటుంది. వ్యవసాయ భూముల మధ్య ప్రశాంతంగా ఉండే గ్రామమిది.
లక్నవరం..
లక్నవరం గ్రామం కొండలు, అడవులతో అద్బుతంగా ఉంటుంది. లక్నవరం సరస్సు పై ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దాని అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.