ప్రపంచంలో అత్యంత  పొడవైన పాములు ఇవే.. 

ప్రపంచంలోనే అతి పెద్ద, బరువైన ఆకుపచ్చ కొండచిలువ సుమారు 30 అడుగుల పొడవు ఉంటుంది. 

ప్రపంచంలోనే అతి పెద్ద పాముల్లో ఒకటైన రెటిక్యులేటెడ్ పైథాన్.. సుమారు 29 అడుగుల వరకూ పెరుగుతుంది. 

ఆస్ట్రేలియాలోని న్యూ గినియా ప్రాంతంలో కనిపించే అమెథిస్టైన్ పైథాన్ సుమారు 27 అడుగుల పొడవు ఉంటుంది.

ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కనిపించే బర్మీస్ పైథాన్ సుమారు 23 అడుగుల పొడవు ఉంటుంది. 

ప్రపంచంలోని అతి పెద్ద పాముల్లో ఒకటైన ఇండియన్ పైథాన్ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. 

 ఆఫ్రికాలో కనిపించే ఆఫ్రికన్ రాక్ పైథాన్ అనే కొండచిలువ సుమారు 16 అడుగుల పొడవు ఉంటుంది. 

ఆఫ్రికాలో కనిపించే బ్లాక్ మాంబా అనే విష పూరిత పాము సుమారు 14 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతుంది.

దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపించే బోవా కన్‌స్ట్రిక్టర్ పాములు సుమారు 13 నుంచి 15 అడుగుల పొడవు ఉంటాయి.

అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా పాము సుమారు 13 నుంచి 15 అడుగుల వరకూ పెరుగుతుంది.

ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే కింగ్ బ్రౌన్ స్నేక్.. సుమారు 11 నుంచి 14 అడుగుల వరకు పెరుగుతుంది.