షుగర్ పేషెంట్లు తినాల్సిన లో- జీఐ ఫుడ్స్ ఇవే..!
ఓట్స్ జీఐ దాదాపు 55 ఉంటుంది. ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా, రాత్రి డిన్నర్‌గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు.
చిక్కుళ్లు, ఇతర కాయధాన్యాల జీఐ 30-40 మధ్యలో ఉంటుంది. ప్రోటీన్లు, ఫైబర్‌తో నిండిన వీటిని తీసుకోవడం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది.
బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, బీరకాయ వంటి కూరగాయలు చాలా తక్కువ జీఐని కలిగి ఉంటాయి. ఇవి డయాబెటిక్ ఉన్న వారికి ఎంతో ఉత్తమం.
స్టాబెర్రీలు, బ్లూబెర్రీలు మొదలైనవి దాదాపు 40 జీఐని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోకి చక్కెరను చాలా నెమ్మదిగా విడుదల చేస్తాయి.
బార్లీ, క్వినోవా వంటి తృణ ధన్యాలు 40-50 మధ్య జీఐని కలిగి ఉంటాయి. తెల్ల అన్నానికి ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటే మంచిది.
బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు కూడా తక్కువ జీఐని కలిగి ఉంటాయి.
సాదా గ్రీక్ యోగర్ట్ దాదాపు 35 జీఐని కలిగి ఉంటుంది. ప్రోటీన్‌ను హెచ్చు స్థాయిలో కలిగి ఉండే యోగర్ట్ మధుమేహులకు చాలా మంచిది.
యాపిల్స్, పీర్స్, బేరీ వంటి పండ్లు 30-50 మధ్య జీఐని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెరగనీయవు.
క్యారెట్‌లు 35 జీఐను కలిగి ఉంటాయి. శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తాయి.
Related Web Stories
జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!
పరగడుపునే ఈ 8 పనులు చేస్తే ఆరోగ్యం, ఆనందం మీ వెంటే..!
బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ తెల్లని ప్యాకెట్లతో ఇన్ని లాభాలా?
పేరుపొందిన ఆహారాలు వాటితో కలిగే దుష్ప్రభావాలు ఇవే..