జుట్టు రాలడంలో జుట్టు చిట్లడం ప్రధాన కారణంగా పేర్కొంటారు.
జుట్టు చిట్లితే ఎదుగుదల ఉండదు.
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు తేమ జుట్టు ఉబ్బడానికి కారణం అవుతుంది. దీని వల్ల జుట్టు చివర్లు చిట్లడం. జుట్టు టెంకాయ పీచులా మారడం జరుగుతుంది.
జుట్టును ఎక్కువగా వాష్ చేయడం వల్ల తల చర్మంలో సహజ నూనెలు పోతాయి. ఇది జుట్టు పొడిగా మారడానికి, చిట్లడానికి కారణం అవుతుంది.
జుట్టుకు సరిపడని ఉత్పత్తులను వినియోగించడం వల్ల కూడా జుట్టు పొడిబారడం, చిట్లడం జరుగుతుంది.
జుట్టును స్టైల్ చేయడానికి హెయిర్ డ్రైయర్లు, హెయిర్ స్ట్రైయిటనర్ లు వినియోగించడం వల్ల కూడా జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయి. ఇవి జుట్టు చిట్లడానికి కారణం అవుతాయి.
రసాయనాలతో కూడిన హెయిర్ కలర్ లు వినియోగించడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. చిట్లుతుంది.
జుట్టు సంరక్షణలో సల్ఫేట్, కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలను అస్సలు వినియోగించకూడదు.