ఈ ఉద్యోగాలు చేసే వారు సంతోషంగా ఉండరట..!

స్టాక్ మార్కెట్ ఎంత అనిశ్ఛితిగా ఉంటుందో తెలిసిందే. అస్థిరమైన స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారట.

ఇన్సూరెన్స్ ఏజెంట్లు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారట. వినియోగదారుల నుంచి, పై అధికారుల నుంచి కూడా వీరికి సమస్యలు తప్పవు.

యంత్రాలపై లోతైన అవగాహన కలిగి ఉండాల్సిన కార్ మెకానిక్‌లు కూడా శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ఎంతో లోతైన పరిజ్ఞానం కలిగి ఉండాల్సిన న్యాయవాదులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండరట. తీవ్ర ఒత్తిడితోనే రోజులను గడుపుతారట.

ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పని కూడా చాలా కష్టంగా ఉంటుందట. వారి పని తీరు మీదే ప్రభుత్వాల ఆదాయం ఆధారపడి ఉంటుంది. వీరు నిరంతరం లెక్కలతో కుస్తీలు పట్టాల్సిందే.

నిత్యం జనాలతో వ్యవహరిస్తూ వారి ద్వేషాన్ని ఎదుర్కొనే రాజకీయ నాయకులు కూడా సంతోషంగా ఉండలేరట. పాలన, సామాజిక, రాజకీయ వ్యవహారాలలో వారి కీలక పాత్ర గురించి తెలిసిందే.

ఖరీదైన ఆస్తుల విక్రయం చేయాల్సిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా టార్గెట్‌ల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు నిత్యం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడిలో పని చేస్తారు. ఎండలో, వానలో, చలిలో కూడా వీరి పని ఆగదు.

ఉత్పత్తుల గురించి మాట్లాడేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం వినియోగదారులతో మాట్లాడే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు.