మనచుట్టూ ఉండే అత్యంత  విషపూరితమైన మొక్కలివీ..!

ఆముదం మొక్క.. ఆముదం విత్తనాలలో రిసిన్ అనే శక్తివంతమైన టాక్సిన్ ఉంటుంది.

బ్లాక్ నైట్ షేడ్.. ఆయుర్వేదంలో దీన్ని కాకామాచి అంటారు. దీంట్లో అట్రోపిన్ ఉంటుంది. ఇది మతి చలించడానికి, మరణానికి కారణమవుతుంది.

గన్నేరు.. ఇందులో ఉండే టాక్సిక్ కార్డియాక్ గ్లైకోసేడ్స్ తీవ్రమైన గుండె సమస్యలు కలిగిస్తుంది.

 సర్పగంధ.. ఈ మొక్కలో ట్రెమెటాల్  ఉంటుంది. ఇది పాల జ్వరం రావడానికి కారణమవుతుంది.

ఫాక్స్ గ్లోవ్.. ఇందులో కార్డియాక్ గ్లేకోసైడ్ లు ఉంటాయి. ఇది గుండె స్పందలను దెబ్బతీస్తుంది.

వాటర్ హెమ్లాక్.. ఇది కూడా గన్నేరులాగా అత్యంత విషపూరితమైన చెట్టు. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

గురివింద గింజ.. వీటిలో కూడా రిసిన్ మాదిరిగానే అబ్రిన్ ఉంటుంది.

మంచినీల్.. ఈ చెట్టు చాలా విషపూరితం. దీంట్లో అన్ని భాగాలు తీవ్రమైన చర్మ సమస్యలను, శరీరంలో అవయవాలను దెబ్బతీస్తాయి.