రామమందిర నిర్మాణం, ప్రారంభం తర్వాత అయోధ్య హాట్ టాపిక్ గా మారింది. ఆ శ్రీరామ చంద్రుని దర్శనం కోసం వెళితే తప్పకుండా తినాల్సిన ఫేమస్ ఆహారాలు ఇవీ..
రబ్డి..
రబ్దీని సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తో వడ్డిస్తారు. పాలను బాగా మరిగించి చేసే ఈ తీపి వంటకం చాలా మధురంగా ఉంటుంది.
తాండై..
తాండైని రిప్రెషింగ్ పానీయంగా పరిగణిస్తారు. పాలు, గింజలు, కుంకుమపువ్వు, ఏలకులు, సోపు గింజలు, గులాబీ రేకులు వేస్తారు. దీని సువాసన నుండి రుచి వరకు అమోఘం.
రామ్ లడ్డు..
రామ్ లడ్డూలు పెసరప్పుతో తయారుచేసిన మిశ్రమాన్ని ఉపయోగించి పకోడా లాగా తయారుచేస్తారు. వీటిని చింతపండు చెట్నీతో తింటే ఆ రుచి అద్బుతం.
లిట్టీ చోఖా..
గోధుమ పిండి మధ్యలో శనగపిండి, ఇతర మసాలా దినులతో కూడిన మిశ్రమాన్ని ఉంచి పేడ పిడకల నిప్పులలో కాల్చుతారు. ఇవే లిట్టీ. వంకాయ, టమోటా, బంగాళాదుంప వంటి కూరగాయలను కాల్చి, బాగా మెదిపి దీనికి కారం, ఉప్పు ఇతర మసాసాలు కలుపుతారు.
మఖన్ మలై..
గట్టి క్రీమ్, కుంకుమపువ్వు, పిస్తాపప్పులతో మఖన్ మలై తయారుచేస్తారు. దీన్ని తింటే స్వర్గంలా ఉంటుదని ఫుడీస్ అభిప్రాయం.
కచోరీ సబ్జీ..
కచోరి సబ్జీ చూడడానికి మందంగా ఉంటుంది. లోపల కాయధాన్యాలు, మసాలాతో నింపబడి ఉంటుంది. వీటిని చిక్కని బంగాళాదుంప కూరతో వడ్డిస్తారు.
గుజియా..
అయోధ్యలో తప్పనిసరిగా గుజియా తినాల్సిందే. ఇవి తెలుగువారి కజ్జీకాయలకు దగ్గరగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, ఖోయా, సుగంధద్రవ్యాలు స్టప్ చేస్తారు. తింటూంటే క్రిస్పీగా, తీపి రుచితో భలే ఉంటుంది.