సంతానోత్పత్తి కోసం చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు స్త్రీలు. అసలు ఆరోగ్యకరమైన బిడ్డలు కలగాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. అలా ఉండాలంటే తీసుకోవాల్సిన సరైన ఆహారం ఇదే..
బాదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది పిండాన్ని బలపరిచే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది.
వాల్ నట్స్ వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి అండోత్పత్తికి, పిండం నాణ్యతను మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.
పనసగింజలలో సెలీనియం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పునరుత్పత్తికి అవసరమైన ఖనిజం.
అవిసె గింజలలో లిగ్నాన్స్ అనే పోషకం ఉంది. ఇది హార్మోన్లను నియంత్రిస్తుంది.
చియా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్లు ఉన్నాయి.
గుమ్మడికాయ గింజలలో జింక్ ఉంటుంది. ఇది పిండం పెరుగుదలకు మంచిది.
పొద్దు తిరుగుడు గింజలలో విటమిన్ ఇ ఉంది. ఇది ఎగ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.