భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!

జనరల్ షెర్మాన్..   ఈ చెట్టు కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్ లోని జెయింట్ సీక్వోరియాలో ఉంది. 275అడుగుల పొడవుతో ఉంటుంది. ఇది 2000సంవత్సరాల కంటే ముందుదని అంచనా.

జనరల్ గ్రాంట్.. ఈ చెట్టు ప్రపంచంలో రెండవ అతిపెద్ద చెట్టు. ఇది కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్ లోఉంది.  దీనిని నేషన్స్ క్రిస్మస్ ట్రీ అని పిలుస్తారు.

హైపెరియన్..   కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో ఈ చెట్టు ఉంది. 379.7 అడుగుల ఎత్తుతో ప్రాణాలతో  ఉన్న చెట్టు ఇది.

హీలియోస్..  కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో ఇది ఉంది. దీని ఎత్తు దాదాపు 379.3 అడుగుల ఎత్తు.

సెంచూరియన్.. ఈ చెట్టు చాస్మానియా లోని ఆర్వ్ వ్యాలీలో ఉంది. దీని ఎత్తు సుమారు 327 అడుగుల ఎత్తు.

డోర్నర్ ఫిర్.. ఒరెగాన్ కూస్ కౌంటీలో సముద్రతీరంలో ఉండే డగ్లస్ ఫిర్ చెట్టు ఇది.దీని ఎత్తు దాదాపు 327.4 అడుగులు.  అత్యంత ఎత్తైన నాన్-రెడ్ వుడ్ చెట్టు ఇది.

ఏంజెల్ ఓక్.. సౌత్ కరోలినాలోని ఉండే సదరన్ లైవ్ ఓక్ చెట్టు ఇది.  17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పందిరిలాగా విస్తరించి ఉంటుంది. 

మెతుసెలా.. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటైన్స్ లోని గ్రేట్ బేసిన్ బ్రిస్టల్ కోన్ ఫైన్ చెట్టు ఇది. ఇది 4,850 సంవత్సరాల వయసుతో పురాతనమైన చెట్టుగా గుర్తించబడింది.