అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? వీటిని గుర్తించండి..!
మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఒత్తిడి వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది.
అకస్మాత్తుగా బరువు పెరుగుతుంటే, ముఖ్యంగా పొట్ట పెరుగుతుంటే షుగర్ టెస్ట్ చేయించుకోండి. కొందరిలో మధుమేహం వల్ల బరువు పెరగడం, తగ్గడం కూడా జరుగుతుంది.
రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తరచుగా తింటున్నారేమో చెక్ చేసుకోండి. అలా చేయడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు.
మీ బరువు పెరగడానికి థైరాయిడ్ కూడా కారణం కావచ్చు. హార్మోనల్ సమస్యలైన హైపో థైరాయిడిజమ్, పీసీఓడీ కూడా బరువును పెంచేస్తాయి.
మీకు నిద్ర సరిపోక పోవడం వల్ల ఆకలిని పెంచే, మెటబాలిజమ్‌ను తగ్గించే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.
కొన్ని మందుల వాడకం కూడా మీ బరువును పెంచేస్తాయి. యాంటీ డిప్రసెంట్, స్టిరాయిడ్స్, మానసిక సమస్యలకు తీసుకునే మందులు వల్ల బరువు పెరుగుతారు.
వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజమ్ తగ్గిపోతుంది. 40 ఏళ్ల దాటాక తిండి తగ్గించకపోతే అది శరీరంలో కొవ్వులా నిల్వ ఉండిపోతుంది.
కొందరిలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఓ వయసు వచ్చే సరికి మెటబాలిజమ్ తగ్గిపోతుంది. అధిక బరువు సమస్య మొదలవుతుంది.
Related Web Stories
మంచి కొవ్వు పెరగాలంటే ఇలా చేయండి సరిపోతుంది..!
PCOSని రివర్స్ చేయడానికి 5 సహజ మార్గాలు..
కొబ్బరి నూనెతో ముఖం టాన్ తగ్గించడం ఎలా..!
మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!