మీకు షుగర్ ఉందా?  ఆ లక్షణాలకు కారణాలు ఇవే.. 

చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారిలో దాహం, అతి మూత్రం, ఆకలి, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడతాయి. వాటి వెనకున్న కారణాలేంటో తెలుసుకుందాం. 

రక్తంలో అధిక స్థాయిల్లో ఉన్న చక్కెరను తొలగించడానికి కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఆ చక్కెరను యూరిన్ రూపంలో బయటకు పంపుతాయి. ఫలితంగా ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి ఉంటుంది. 

ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం వల్ల శరీరంలోని నీటి శాతం పడిపోతుంది. ఫలితంగా అధికంగా దాహం వేస్తుంది. 

అధిక స్థాయి చక్కెరతో కూడిన రక్తం చాలా నెమ్మదిగా రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. ఆ రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె తీవ్రంగా పని చేయాల్సి ఉంటుంది. 

రక్తంలో ఉన్న చక్కెర శరీరంలోని కీలక భాగాలకు చేరుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీ, బ్రెయిన్ వంటి కీలక అవయవాలు దీర్ఘకాలంలో సమస్యలకు గురవుతాయి. 

చక్కెరతో కూడిన రక్తం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లకు తగిలిన దెబ్బలు త్వరగా తగ్గకపోవడం జరుగుతుంది. 

రక్తం, మూత్రంలో ఉన్న చక్కెర బ్యాక్టీరియాకు ఫుడ్‌గా మారుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా దాడి చేస్తాయి. శరీరంలో తేమ ఎక్కువగా ఉన్న భాగంలో ఎలర్జీలు మొదలవుతాయి. 

హై బ్లడ్ షుగర్ స్థాయిలు కంటి పాప వాపునకు కారణమవుతాయి. ఫలితంగా దృష్టి స్పష్టంగా ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఈ సమస్య కూడా తగ్గుతుంది.