పిల్లలు సాధించే చిన్న విజయాలను కూడా తల్లితండ్రులు సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఎందుకంటే..!

పిల్లలు సాధించే చిన్న విజయాలను సెలబ్రేట్ చేయడం వల్ల పిల్లలలో విశ్వాసం, జీవితంపై సరైన దృక్పథం ఏర్పడతాయి.

పిల్లలు చేసే చిన్నపనులను ప్రశంసించడం, మెచ్చుకోవడం చేస్తే పిల్లలలో సెల్ఫ్ వ్యాల్యూస్, సెల్ఫ్ కాన్పిడెంట్ పెరుగుతుంది.

చిన్న విజయాలను  సెలెబ్రేట్ చేయడం వల్ల పిల్లలు దృఢంగా మారతారు.  సంతోషంగా ఉండటానికి చిన్న విజయాలు కూడా తృప్తిని ఇస్తాయని తెలుసుకుంటారు. ఇది ఎప్పుడూ వారిని సంతోషంగా ఉంచుతుంది.

పిల్లలు సాధించే చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తుంటే వారు క్రమంగా నేర్చుకోవడం పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. ఏదైనా చాలా ఇష్టంగా నేర్చుకోవడం,  చేయడం చేస్తారు.

చిన్న విజయాలు పిల్లలలో భావోద్వేగాలను బలంగా మారుస్తాయి. అపజయాల ద్వారా ఎదురైన బాధను ఈ చిన్న విజయాల ద్వారా లభించే సంతోషంతో అధిగమిస్తారు.  

పిల్లలు సాధించే విజయాలను తల్లిదండ్రులు సెలబ్రేట్ చేస్తుంటే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధం దృఢంగా మారుతుంది.

తల్లిదండ్రులు తమ కోసం చేస్తున్న దాన్ని చూసి పిల్లలకు కృతజ్ఞతాభావం పెరుగుతుంది. ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

పోటీ ప్రపంచంలో  చిన్న చిన్న విజయాలు  పిల్లలలో పాజిటివ్ ఆలోచనలను, వ్యక్తిగత ఎదుగుదలను పెంచుతుంది. విజయాలు సాధించడం అంటే తాము వ్యక్తిగతంగా ఎదగడం అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు.

తల్లిదండ్రులు పిల్లలను ప్రశంసిస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తు పట్ల గొప్పగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విజయాలు తమ వ్యక్తిగత ఎదుగుదలలో కీలకంగా మారుతున్నాయని అర్థం చేసుకుంటారు.