మీ ఏసీలో ఉండే వివిధ రకాల మోడ్‌లను మారుస్తూ ఉండండి. ఎకో మోడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్‌లను కూడా వాడుతూ ఉండండి.
ఏసీ వేసినపుడు సీలింగ్ ఫ్యాన్లను వేయకండి. ఒకేసారి ఏసీ, ఫ్యాన్ రెండూ వేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదు.
ఏసీ ఉన్న గదిలో ప్రకాశవంతమైన లైట్లు, ఇనుప బీరువాలు మొదలైనవి లేకుండా చూసుకోండి. అవి ఉండడం వల్ల గది త్వరగా చల్లబడదు.
మీ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించండి. ఏసీలో గ్యాస్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయించండి. దుమ్ము, ధూళీ లేకుండా నీట్‌గా క్లీన్ చేయించండి.
మీరు కొత్తగా ఏసీ కొంటున్నట్టైతే కాస్త ఖరీదు ఎక్కువైనా ఇన్వెర్టర్ ఏసీని మాత్రమే కొనండి. అది మీ కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది.
ఏసీ ఉన్న గది తలుపులు, కిటికీల నుంచి గాలి లీక్ అవుతుందేమో చూసుకోండి. అలా చల్ల గాలి బయటకు పోవడం వల్ల రూమ్ ఎప్పటికీ కూల్ అవదు.
రాత్రి నిద్రపోయే ముందు మీ ఏసీలో టైమర్ సెట్ చేసుకోండి. ఐదు లేదా ఆరు గంటల తర్వాత ఏసీ ఆఫ్ అయిపోయేలా సెట్ చేసుకోండి.
బయట బాగా వేడిగా ఉన్నప్పుడు మీ ఏసీ టెంపరేచర్‌ను 25-26 డిగ్రీల మధ్య మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. అలాగే విద్యుత్తు కూడా ఆదా అవుతుంది.
ఏసీ వినియోగం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మీరు గదిలో లేనపుడు ఏసీని ఆన్ చేసి ఉంచకండి.