వేపుడు పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అనారోగ్యకర ఆయిల్ ఉపయోగిస్తారు. ఫలితంగా చెడు కొలస్ట్రాల్ పెరిగి, గుండె సమస్యలు మొదలవుతాయి.
వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల ప్రమాదకర సమ్మేళనాలు రూపొందుతాయి. అవి ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్లి కేన్సర్ ముప్పును పెంచుతాయి.
తియ్యటి పదార్థాలు తినడం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంత ప్రమాదమో, ఫ్రై చేసిన పదార్థాలు తినడం కూడా అంతే ప్రమాదం. ఫ్రైడ్ ఫుడ్స్ చాలా త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి.
బాగా వేయించిన పదార్థాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. హై క్యాలరీలు కలిగిన ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి.
తరచుగా వేపుడు పదార్థాలు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు మొదలవుతాయి. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
వేపుడు పదార్థాలలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు వంటివి ఏవీ ఉండవు. ఫ్రైడ్ ఫుడ్స్‌తో ఆకలి తీర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
నూనెలో వేయించినపుడు అనారోగ్యకర కొవ్వుల కారణంగా ప్రమాదకర సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలోకి చేరి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి.
ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఉప్పు, కారం, ఇతర మసాలాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోకి చేరి రక్తపోటును పెంచుతాయి.