బోర్లా పడుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
ఆరోగ్యాన్ని కేవలం నిద్ర మాత్రమే కాదు.. నిద్రించే భంగిమ కూడా ప్రభావితం చేస్తుంది.
చాలామంది బోర్లా పడుకుంటుంటారు. పొట్టను కిందకు ఆన్చి ఇలా నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు ఎదురవుతాయి.
బోర్లా పడుకోవడం వల్ల వెన్నుపాముపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారికి కాలక్రమేణా మెడ, వెన్ను, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదమెక్కువ.
బోర్లా పడుకున్నప్పుడు తల ఒకవైపు తిప్పి పడుకుంటారు. దీనివల్ల తల, వెన్నెముక స్లిప్ అయ్యే ప్రమాదమెక్కువ.
బోర్లా పడుకున్నప్పుడు దిండుకున్న దుమ్ము, ధూళి ముఖానికి తగిలి చర్మ సంబంధ సమస్యలు ఎక్కువ వస్తాయి. చర్మం తొందరగా ముడుతలు పడుతుంది.
కొన్ని అధ్యయనాలు మాత్రం బోర్లా పడుకోవడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నాయి.