నూడిల్స్ తినడం వల్ల  వచ్చే అనారోగ్యాలు ఇవే..!

ఇన్‌స్టంట్ న్యూడిల్స్ లేదా రోడ్డు పక్కన, హోటళ్లలో దొరికే నూడిల్స్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే అవి చాలా అనారోగ్యాలను కలిగిస్తాయి. 

నూడిల్స్‌లో కార్బోహైడ్రేట్లు, చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే బరువు పెరగడం ఖాయం.

నూడిల్స్ తయారీలో రకరకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. నూడిల్స్ తరచుగా తినడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 

నూడిల్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అలాగే చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. 

నూడిల్స్‌లో వాడే అధిక మోతాదు మసాలాలు జీర్ణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. 

రోడ్డు పక్కన స్టాల్స్‌లో దొరికే నూడిల్స్ గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. 

నూడిల్స్‌లో ఎలాంటి పోషకాలు, విటమిన్లు ఉండవు. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ మొదలై ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.