విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!

ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి విటమిన్-డి చాలా కీలకం.  కానీ విటమిన్-డి ఎక్కువైతే  దాన్ని విటమిన్-డి టాక్సిసిటీ అంటారు. దీనివల్ల శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

విటమిన్-డి ఎక్కువైతే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దీన్ని హైపర్ కాల్సెమియా అంటారు.

శరీరంలో విటమిన్-డి ఎక్కువ ఉంటే బలహీనత,  అలసట,  నిరాశ,  గందరగోళం, కోమాలోకి వెళ్లడం,  పాలీయూరియా వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్-డి  శరీరంలో ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండ వైఫల్యం,  మృదు కణజాలాలలో కాల్సిఫికేషన్లు,  కండ్ల కలక, చలి,జ్వరం,  అనోరెక్సియా, వికారం,  వాంతులు మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్-డి కోసం సప్లిమెంట్లు తీసుకునేవారిలో కొన్నిసార్లు విటమిన్-డి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో విటమిన్-డి టాక్సిసిటీ ఏర్పడుతుంది.

విటమిన్-డి టాక్సిసిటీ  ఏర్పడినప్పుడు దీన్నికనుక్కోవడం పెద్ద సవాలుగా ఉంటుంది.