లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!
లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడటం వల్ల టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.
ల్యాప్టాప్ లు టేబుల్ మీద పెట్టుకుని ఉపయోగించాలి. కానీ చాలామంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒడిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇది శరీర పొజిషన్ ను దెబ్బతీస్తుంది.
ల్యాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడితే ల్యాప్టాప్ నుండి వెలువడే వేడి పురుషులలో స్పెర్మ్ నాణ్యతను బలహీనపరుస్తుంది. ఇది సంతానోత్పత్తిలో ఇబ్బందులు కలిగిస్తుంది.
ఒడిలో పెట్టుకున్నప్పుడు ల్యాప్టాప్ కళ్లకు చాలా దగ్గరగా ఉంటుంది.ఈ కారణంగా కంటిపై భారం పడుతుంది. కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకున్నప్పుడు మెడ, తల, వెన్ను భాగాన్ని ఎక్కువసేపు వంచి పనిచేస్తుంటారు. దీనివల్ల వెన్నునొప్పి సమస్య వస్తుంది.
ల్యాప్టాప్ ను ఒడిలో ఉంచుకుని ఎక్కువసేపు పనిచేస్తే శరీరానికి ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.