మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

ఐరన్ లోపం ఉంటే కనిపించే సాధారణ లక్షణాలలో అలసట,  బలహీనత ఒకటి. ఐరన్ తక్కువ ఉంటే శరీరంలో   కణజాలాలకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా  తక్కువ ఉంటుంది. ఇది బలహీనంగా ఉంచుతుంది.

ఐరన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది.  చర్మం సాధారణం కంటే తక్కువ రంగులో పాలిపోయినట్టు ఉంటుంది.  ముఖం, చిగుళ్లు,  కనురెప్పల కింది భాగంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఐరన్, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ సరఫరా కూడా తక్కువగా ఉంటుంది.  నడవడం, మెట్లు ఎక్కడం,  ఇంటి పనులు మొదలైనవి చేసినప్పుడు ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువ ఉన్నప్పుడు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కష్టపడుతుంది.  దీనివల్ల గుండె వేగంగా పనిచేస్తుంది.  గుండె దడ, గుండె పనితీరులో  తేడాలు ఉంటాయి.

ఆక్సిజన్ సరఫరా తక్కువ ఉన్నప్పుడు మెదడుకు కూడా ఆక్సిజన్ సరఫరా లోపం ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన తలనొప్పి,  కొన్నిసందర్భాలలో మైకం కూడా కలగవచ్చు.

ఐరన్ తక్కువగా ఉంటే రక్తప్రసరణ కూడా తక్కువగా ఉంటుంది. కొందరిలో కాళ్లు, చేతులు చాలా చల్లగా ఉంటాయి.

ఐరన్ లోపిస్తే గోర్లు పెళుసుగా మారుతాయి.  గోర్ల మీద పొట్టు లేవడం, గోర్లు సున్నితంగా మారి విరిగిపోవడం జరుగుతుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్న మహిళలలో జుట్టు రాగి రంగులో ఉండటం,  సున్నితంగా మారడం,  రాలిపోవడం వంటి  సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి.