జుట్టు బాగా రాలుతోందా? అసలు కారణాలు ఇవే..!
రక్తం లేకపోవడం, పోషకాహార లోపం, బలహీనత, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం మొదలైనవి రక్తహీనత లక్షణాలు. ఇది జుట్టు రాలిపోవడానికి కూడా కారణం అవుతుంది.
డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది.
థైరాయిడ్ తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి వల్ల జుట్టు రాలుతుంది.
జుట్టును స్టైల్ చేయడానికి ఉపయోగించే హెయిర్ స్టైలింగ్ టూల్స్, హెయిర్ కలర్ లైదా డై ఉపయోగిస్తే అవి కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి.
పిసిఓయస్ సమస్యతో బాధపడే మహిళలలో జుట్టు రాలే సమస్య అధికం.
మెనోపాజ్ దశలో శరీరంలో హార్మోన్లకు ఆటంకం కలుగుతుంది. ఇది కూడా జుట్టు రాలడానికి కారణం.
అధిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోకుంటే మానసిక ఆరోగ్యం దెబ్బతిని జుట్టు రాలిపోతుంది.
అలోపేసియా అనే ఆటో ఇమ్యూన్ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. తల, కనుబొమ్మలు, ఇతర భాగాలలో జుట్టు బాగా రాలిపోతుంది.
జంక్ పుడ్, అతిగా వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్ తినడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు రాలిపోతుంది.
రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ కు చెందిన మందులు వాడేవారిలో జుట్టు రాలడం ఎక్కువ.
Related Web Stories
మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!
నాన్‌స్టిక్ పాన్ ఆరోగ్యమేనా..!
మీకు తెలుసా? భారత్‌లోని ఈ ప్రాంతాల్లో మాంసాహారం నిషేధం
గణేశ చతుర్థి పండుగ సందర్భంగా 21,000 గణేశ విగ్రహాలతో ప్రదర్శన