విటమిన్ బీ12 లోపం..
కనిపించే లక్షణాలు ఇవే..
విటమిన్ బీ12 లోపం వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. ఫలితంగా బలహీనత, బ్యాలెన్స్ కోల్పోవడం, తల తిరగడం మొదలైనవి కనిపిస్తాయి.
బీ12 లోపం మీ దృష్టిపై కూడా పడుతుంది. కొన్ని సార్లు చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
బీ12 లోపం ఉంటే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ఎక్కువగా జరగదు. ఫలితంగా చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
విటమిన్ బీ12 తక్కువగా ఉంటే కార్డియోవాస్క్యులర్ వ్యాధులు కూడా మొదలవుతాయి. ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. గుండె కొట్టుకునే రేటు మారుతుంటుంది.
శరీరానికి తగినంతగా బీ12 అందకపోతే కణాలు సరిగ్గా పని చేయలేవు. ఫలితంగా ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంటుంది.
బ్రెయిన్ ఫంక్షన్స్‌కు బీ12 అత్యవసరం. బీ12 తగ్గితే జ్ఞాపకశక్తి కోల్పోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బీ12 లోపం వల్ల తల తిరగడం, డయేరియా, వాంతులు వంటి సమస్యలు మొదలవుతాయి. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నా, ఆకలి తక్కువగా ఉంటున్నా బీ12 లోపం ఉన్నట్టే.
Related Web Stories
ఈ నేచురల్ ఫుడ్స్ మీ కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..
సాగర తీరంలో విభిన్న గణపతులు
బలమైన తెల్లటి దంతాల కోసం ఇలా చేయండి..
ముంబై లాల్బాగ్చా రాజా గణేష్‌కు అనంత్ అంబానీ భారీ విరాళం