గుండె పోటు రావడానికి నెల ముందు నుంచే మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎలాంటి కారణం లేకున్నా అలసట, బలహీనత రావడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. 

చాలా కాలం పాటు ఇలా అకారణంగా అలసట, నీరసం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. 

చాలా కాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది గుండె సమస్యకు కారణం కావొచ్చు.

ఛాతిలో భారం, శ్వాసలో మార్పు ఉన్నా కూడా అశ్రద్ధ చేయొద్దు. 

చేతులు, మెడ, దవడ వంటి అవయవాలు పదే పదే లాగుతూ అసౌకర్యంగా ఉన్నా కూడా జాగ్రత్తపడాలి. 

గుండె కొట్టుకోవడం సక్రమంగా లేదనే అనుమానం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

పాదాలు, చీలమండల్లో వాపు కూడా గుండె సమస్యలకు కారణం కావొచ్చు. 

ఇలాంటి సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చు.