బ్లడ్ షుగర్ పెరిగిపోతే.. శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేనప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని అసాధారణ పరిస్థితులు వేధిస్తాయి.

అసాధారణంగా బరువు పెరిగిపోవడం లేదా బాగా సన్నబడడం

మెడ చుట్టూ చర్మం బాగా నల్లగా మారిపోవడం.

కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం

ఊపిరి తీసుకుని వదిలేటపుడు దుర్వాసన వస్తుండడం

దృష్టి మసకబారుతున్నట్టు అనిపించడం

ఉదయం లేచిన వెంటనే పాదాల్లో నొప్పులు రావడం

దురదలు, తామర వంటి చర్మ సంబంధ సమస్యలు రావడం

తరచుగా ఇన్ఫెక్షన్లకు గురి కావడం

గాయాలు త్వరగా నయమవకపోవడం