త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

భారతదేశ చరిత్రలో పింగళి వెంకయ్య పేరు చిరస్మరణీయం.  జాతీయ జెండాను రూపొందించి  భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారీయన.

పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలో భట్లపెనుమారు అనే ఊర్లో జన్మించారు.

 మద్రాసులో ఉన్నత పాఠశాల విద్యలో ఉత్తీర్ణత సాధించి తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేశారు.  

గ్రాడ్యుయేషన్ అనంతరం లక్నోలో రైల్వే గార్డుగా పనిచేశారు.

తరువాత లాహోర్ నుండి ఉర్దూ,  జపనీస్ భాషలను కూడా అభ్యసించి భాషా జ్ఞానాన్ని పెంచుకున్నాడు.

కేవలం ఇవి మాత్రమే కాదు.. పింగళి వెంకయ్య గారు వజ్రాల గనులలో నిపుణులు.  వ్యవసాయ రంగంపై చాలా లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి.

పింగళి వెంకయ్య ప్రతిభావంతుడే కాదు.. ఈయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో  పనిచేశారు.  దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో-ఇండియన్ యుద్దంలో పాల్గొన్నారు.

40 ఏళ్ళ వయసులో గాంధీజీతో పరిచయం ఏర్పడింది.  గాంధీజి ద్వారా చాలా ప్రభావితమయ్యారు. భారతదేశానికి జాతీయ పతాకం కోసం చాలా శ్రమించాడు.

ఐదేళ్లలో 30కి పైగా దేశాల జెండాలను అధ్యయనం చేసి చివరకు త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు.

పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని జూలై 22, 1947న రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ జెండాగా ఆమోదించింది.

జాతీయ పతాకాన్ని రూపొందించినందుకు గానూ పింగళి వెంకయ్యను ఝండా వెంకయ్య అని కూడా పిలుస్తారు

1947,   ఆగస్టు 15న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్య్రం వచ్చిన 16 సంవత్సరాల తర్వాత 1963 జూలై 4 న పింగళి వెంకయ్య మరణించారు.