తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!
కొల్లాపుర్..కృష్ణానది వెంబడి ఉన్న పురాతన దేవాలయాలు, రాజభవనాలకు కొల్లాపూర్ ప్రసిద్ధి చెందింది. కొల్లాపూర్ ప్యాలెన్ అలనాటి రాచరిక రాజ్యానికి గుర్తుగా నిలుస్తోంది.
భువనగిరి..
భువనగిరి లో భారీ కోట ప్రసిద్ధి చెందింది. ఇది ఏకశిలా రాతిపై ఉంటుంది. దీనికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. పై నుండి చూస్తే చుట్టు ప్రక్కల పరిసరాలు అద్భుతంగా కనిపిస్తాయి.
పోచంపల్లి..
నేత కార్మికుల గ్రామంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ప్రసిద్ధ పోచంపల్లి ఇకత్ చీరలకు జన్మస్థలం.
వేములవాడ..
వేములవాడ క్షేత్రంలో శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి పొందింది.
అనంతగిరి హిల్స్..
అనంతగిరి హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తుంది. పచ్చని కొండలలో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ కు మంచి ప్రదేశం.
మెదక్..మెదక్ కేథడ్రల్ చర్చ్ ప్రసిద్ధి చెందింది. ఇది ఆసియాలోనే పెద్దది. చారిత్రక కోటలు, సుందరమైన దృశ్యాలు ఈ పట్టణంలో ఉన్నాయి.
కోటగుళ్లు..కోటగుళ్లు అని పిలువబడే దేవాలయాల సమూహం రహస్య పురావస్తు చిహ్నంగా నిలుస్తోంది.
నర్సాపూర్..
నర్సాపూర్ దట్టమైన అడవులు, సుందరమైన సరస్సులతో ఉంటుంది. ప్రకృతి విహారానికి వెళ్లాలనుకునేవారికి ప్రశాంతమైన పట్టణమిది.
కోరుట్ల..
జగిత్యాల జిల్లాలో కోరుట్ల ఉంది. పాత దేవాలయాలు, సాంప్రదాయ పండుగలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. స్థానిక సంస్కృతి అందరినీ ఆకట్టుకుంటుంది.
షామీర్ పేట్..
హైదరాబాద్ సమీపంలో షామీర్ పేట్ సరస్సు, షామీర్ పేట్ జింకల పార్కు ప్రసిద్ధి చెందింది. పిక్నిక్ లు, బోటింగ్, ప్రకృతిలో గడపాలి అనుకునేవారికి మంచి ఎంపిక.