శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ కోసం ఈ ఫుడ్స్ తినండి..!
క్యారెట్..
క్యారెట్‌లో బీటా-కెరటిన్ అధికంగా ఉంటుంది. విటమిన్-ఎకు క్యారెట్ మంచి సోర్స్. ఒక్క క్యారెట్ తిన్నా రోజులో శరీరానికి అవసరమైన విటమిన్-ఎ అందుతుంది.
తీపి దుంపలు..
స్వీట్ పొటాటోస్‌లో కావాల్సినంత బీటా-కెరటిన్ ఉంటుంది. దానిని మీ శరీరం విటమిన్-ఎగా మార్చుకుంటుంది.
బచ్చలి కూర..
బచ్చలి కూర కూడా విటమిన్-ఎకు మంచి సోర్స్. బచ్చలికూరలో బీటా-కెరటిన్‌తో పాటు ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
రెడ్ పెప్పర్..
రెడ్ పెప్పర్ రుచికి మాత్రమే కాదు.. విటమిన్-ఎను కూడా పుష్కలంగా అందించగలదు.
మామిడిపళ్లు..
మామిడి పళ్లలో విటమిన్-సితో పాటు విటమిన్-ఎ కూడా పుష్కలంగా ఉంటుంది.
బట్టర్‌నట్ స్క్వాష్..
ఆకారంలో గుమ్మడి కాయ కంటే కాస్త చిన్నగా ఉండే బట్టర్‌నట్ స్క్వాష్ విటమిన్-ఎను పుష్కలంగా అందిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పండే ఈ కూరగాయ ప్రస్తుతం మనదేశంలో కూడా లభ్యమవుతోంది.
జంతు కాలేయం..
మాంసాహారం తీసుకునేవారు జంతువుల లివర్ తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్-ఎ దొరుకుతుంది.
కర్బూజ..
కర్జూజాలో కూడా విటమన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దానిని నేరుగా తీసుకున్నా, జ్యూస్ చేసుకుని తాగినా శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ అందుతుంది.
పాలు, గుడ్లు..
పాలు, గుడ్లలో ప్రోటీన్లతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్-ఎ కూడా ఉంటుంది.