ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ పెరిగిపోతే..
మీ శరీరంలో కనిపించే లక్షణాలివే!
రక్తంలో చెడు కొలస్ట్రాల్ పెరిగిపోతే కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా కాళ్లు నొప్పెడుతుంటాయి. అలాగే అసౌకర్యంగా అనిపిస్తాయి.
మోకాళ్లు, మోచేతులు, చేతులు, కను రెప్పలపై పసుపు రంగు మొటిమల వంటివి కనిపించడం కూడా అధిక కొలస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు.
రాత్రివేళల్లో మీ పాదాలు చల్లగా అయిపోతున్నాయా? అయితే వెంటనే కొలస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి.
కాళ్లు, పాదాలు తిమ్మిరి ఎక్కినట్టు ఉండడం లేదా సూదులతో గుచ్చినట్టు ఉండడం కూడా అధిక కొలస్ట్రాల్‌కు సంకేతం.
శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మీ రక్తపోటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
కాళ్లు, పాదాలు తరచుగా ఉబ్బుతున్నా, వాపు వచ్చినట్టు ఉన్నా మీ శరీరంలో చెడు కొలస్ట్రాల్ పేరుకుపోతున్నట్టే.
గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంటే మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోండి
రాత్రి నిద్రవేళల్లో అసౌకర్యంగా అనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం కూడా కొవ్వు ఎక్కువ పేరుకుపోయింది అనేందుకు సంకేతాలే. గుండెకు ఆక్సిజన్ తగినంత అందకపోవడం దీనికి కారణం.
కంటి చుట్టూ పసుపు రంగు మచ్చలు రావడం అధిక కొలస్ట్రాల్‌కు సాధారణ సంకేతం.