వావ్.. ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే  షాకవుతారు..!

బాతులు..

బాతులకు ఈత మాత్రమే కాదు.. గాలిలో ఎగరడమూ వచ్చు. అలాగే భూమి మీద నడవడమూ వచ్చు.

పెంగ్విన్..

పెంగ్విన్ పక్షులు అద్భుతంగా ఈత కొడతాయని తెలుసు. కానీ ఇవి చక్కగా నడవగలవు, అలాగే నీటిలో నుండి పైకి ఎగిరి గాలిలో ఎగురుతాయి కూడా..

సీగల్..

సీగల్ పక్షులు ఎగురుతాయని మాత్రమే తెలుసు. కానీ ఇవి ఈత కూడా కొట్టగలవు. అలాగే బీచ్ ల ఒడ్డున నడుస్తూ షికారు చేస్తాయి.

హంసలు..

ఈత కొట్టే హంసలు గాలిలో ఎగరగలవు. అదే విధంగా వీటి నడకను హంస నడక అంటూ ఆకాశానికి  ఎత్తేయడం తెలిసిందే..

పెలికాన్..

పెలికాన్ పక్షులు ఈదడం, ఎగరడమే కాదు.. ఎంచక్కా భూమి పై నడుస్తాయి కూడా.

ఆల్భాట్రాస్..

ఆల్బాట్రాస్ లు ఎగరడంలో గొప్ప ప్రతిభ కలిగి ఉంటాయి. అంతేనా వీటికి ఈదడం కూడా వచ్చు, అలాగే నడుస్తాయి కూడా.

టెర్న్..

టెర్న్ చురుగ్గా ఎగురుతాయి. అంతేనా ఈత కొట్టడంలో ఇవి బెస్ట్. అలాగే ఇసుక నేలల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయి.

గిల్లెమోట్..

సముద్రపు పక్షులు అయిన గిల్లెమోట్ ఈతలో మంచి ప్రతిభ కలిగి ఉంటాయి. అలాగే భూమిమీద  కొద్దిదూరం నడుస్తాయి.