ఉదయాన్నే ఈ టిఫిన్లు తినండి.. శరీరానికి ప్రోటీన్లు అందించండి..

నిద్ర లేవగానే ఉదయాన్నే తినే ఆహారం ప్రోటీన్లతో నిండినదై ఉండాలి. అప్పుడే శరీరం రీచార్జ్ అవుతుంది. రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. 

ఉదయం టిఫిన్‌గా పెసరట్టు తినడం వల్ల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. 

పెసలు, శనగలు వంటి మొలకలతో సలాడ్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ఎంతో ఉత్తమం. 

రకరకాల కూరగాయలతో ఉప్మా చేసుకుని తినడం కూడా మంచిదే. 

పన్నీర్‌తో నింపిన పరాటాను పెరుగు లేదా పుదీనా చట్నీతో తినడం మంచిది. 

ఉదయాన్నే కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తినడం, ఉడకబెట్టిన గుడ్డు తినడం ఎంతో ఉత్తమం. 

ఉదయాన్నే కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తినడం, ఉడకబెట్టిన గుడ్డు తినడం ఎంతో ఉత్తమం. 

క్వినోవా, కూరగాయలు కలిపి చేసే ఇడ్లీ కూడా తగినన్ని ప్రోటీన్లను అందిస్తుంది. 

రకరకాల కూరగాయలతో చేసిన మసాలా దోశను సాంబార్‌తో కలిపి తింటే మంచిది.