భారతదేశంలోనే కాదు.. ఈ దేశాలలోనూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు..!

దీపావళి..  భారతీయ ఇళ్లు దీపాలతో కళకళలాడే పండుగ.

దీపావళి కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కూడా జరుపుకుంటాయి.

మలేషియా.. మలేషియా ప్రజలకు దీపావళి పండుగ ప్రభుత్వ సెలవు దినం.   బాణసంచా నిషేధించడం వల్ల హరి దీపావళి అని బాణసంచా పేల్చని దీపావళిని జరుపుకుంటారు.

శ్రీలంక.. భారత్ కు పొరుగు దేశం అయిన శ్రీలంకలో అచ్చం భారత్ లో లాగానే దీపావళి జరుపుకుంటారు. ఇళ్లను కొవ్వొత్తులు, లాంతర్లతో అలంకరిస్తారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. అమెరికాలో దీపావళిని జాతీయ సెలవు దినంగా పరిగణిస్తారు. అమెరికాలోని హిందువులే కాకుండా ఇతరులు కూడా దీపావళి జరుపుకుంటారు.

దక్షిణాఫ్రికా.. దక్షిణాఫ్రికా ప్రజలు భారతీయులలాగే దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు.

సింగపూర్.. సింగపూర్ లో దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం ప్రకటిస్తారు.  ఇక్కడి జనాభాలో అధికశాతం భారతీయులే.

నేపాల్.. నేపాల్ లో కూడా భారతీయ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ దీపావళిని భారత్  లో లానే జరుపుకుంటారు.