శునకాలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు కానీ కొన్ని జాతుల శునకాలు సింహాలను సైతం చంపగలవు.
Rottweiler..
రోట్ వేలేర్ అత్యంత బలమైన కుక్కజాతులు. వీటి బలం అసాధారణం. చాలా నమ్మకంగా కూడా ఉంటాయి. సింహాలతో అయినా పోరుకు సై అంటాయి.
మాస్టిఫ్..
మాస్టిఫ్ కుక్కలు చాలా భారీ పరిమాణంలో ఉంటాయి. వీటికి ధైర్యసాహసాలు ఎక్కువ. సింహాన్ని కూడా ఎదుర్కొంటాయి.
బుల్ మాస్టిఫ్..
దొంగలను ఎదుర్కోవడానికి అభివృద్ది చేసిన కుక్కల జాతి బుల్ మాస్టిఫ్. సింహాలను కూడా బెధిరించే ధైర్యం వీటికి ఉంది.
కనగల్..
కనగల్ జాతి కుక్కలు భారీ శరీరంతో ఉంటాయి. ఇవి రక్షణ కోసం ఎంపిక చేయబడ్డవి. వీటి శక్తి అమోఘం. సింహం వంటి భయంకరమైన జంతువులను ఎదుర్కొనే సామర్థ్యం వీటి సొంతం.
బోయర్ బోయెల్..
బోయర్ బోయెల్స్ జాతి కుక్కల కండర నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. వీటికి భయమనేది ఉండదు. సింహాలను కూడా మట్టి కరిపించగలవు.
కాకేసియన్ షెపర్డ్..
కాకేసియన్ షెపర్డ్ కుక్కలు తమ యజమానుల పట్ల చాలా విధేయతతో ఉంటాయి. అంతేకాదు సింహాలను కూడా ఎదుర్కొనే శక్తి వీటికి ఉంటుంది.
తోసా..
తోసా అనే జాతి కుక్కలను ప్రత్యేకంగా పోరాటాలకోసం, రక్షణ కోసం పెంచుతారు. వీటికి ధైర్యం ఎక్కువ. సింహాలను కూడా ఛాలెంజ్ చేస్తాయివి.
డోగో అర్జెంటీనో..
ఈ జాతి కుక్కలు చాలా చురుగ్గా ఉంటాయి. సింహాల వంటి భయంకరమైన జంతువులను కూడా సునాయాసంగా ఎదుర్కొంటాయివి.