హిమోగ్లోబిన్ పెరగాలంటే.. వీటిని కచ్చితంగా తినండి.. 

పాలకూర తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. పాలకూరలో ఉండే విటమిన్-సి ఐరన్ శోషణకు దోహద పడుతుంది. 

ఐరన్ లెవెల్స్ పెరగడానికి తృణ ధాన్యాలు అద్భుతమైన ఔషధం. వాటి వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్, ప్రోటీన్ అందుతాయి. 

కూరగాయల నుంచి లభించే ఐరన్‌‌తో పోల్చుకుంటే రెడ్ మీట్ ద్వారా లభించే ఐరన్ చాలా త్వరగా శోషణం అవుతుంది. 

గుమ్మిడి గింజలు ఐరన్‌కు చాలా మంచి సోర్స్. వీటిల్లో ఐరన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి. 

క్వినావాలో ఐరన్‌తో పాటు ప్రోటీన్స్, అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. 

శనగలు కూడా ఐరన్‌కు మంచి సోర్స్. కూరలు, స్నాక్స్‌ల్లో శనగలు వేసుకుని తింటే చాలా మంచిది. 

టోఫు మంచి ఐరన్ రిచ్ ఫుడ్. శాకాహారులు ఐరన్ కోసం టోఫు తింటే మంచిది. 

దానిమ్మ, బీట్‌రూట్ వంటి వాటి ద్వారా కూడా శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది.