ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచడం వల్ల కేన్సర్ కలిగించే ఆహార పదార్థాలు ఇవే..

కొన్ని పదార్థాలను ఎక్కువ సేపు ఉడికించడం, వేయించడం వల్ల అవి ప్రమాదకరంగా మారతాయి. కేన్సర్ కారకాలుగా పరిణమిస్తాయి. 

బంగాళాదుంపలను ఎక్కువ సేపు వేయించడం వల్ల అక్రిలమైడ్ అనే ప్రమాదకర రసాయనం విడుదలవుతుంది. బంగాళా దుంపులను ఫ్రై చేయడం కంటే ఉడికించడం, బేక్ చేయడమే ఉత్తమం

రెడ్ మీట్‌ను ఎక్కువ సేపు ఉడికించడం వల్ల కేన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయి. రెడ్ మీట్‌ను ఎప్పుడూ తక్కువ మంట మీదనే వండాలి

బ్రెడ్‌ను ఎక్కువ సేపు టోస్ట్ చేస్తే అక్రిలమైడ్ ఫామ్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బ్రెడ్‌కు నేరుగా మంట తగిలేలా ఎప్పుడూ చేయకూడదు. 

పౌల్ట్రీ కోడి మాంసాన్ని ఎక్కువ మంట మీద గ్రిల్ చేసినా, ఫ్రై చేసినా కేన్సర్ కారక కార్కినోజెన్స్ అనే రసాయనం ఫామ్ అవుతుంది. 

చేపలను ఎక్కువ సేపు గ్రిల్ చేయడం, గంటల తరబడి స్టవ్ మీద ఉంచడం వల్ల ప్రమాదం. అలాగే చేపలు సరిగ్గా ఉడకకపోయినా ప్రమాదమే.

ప్రాసెస్ చేసిన చికెన్, మటన్‌ను కూడా ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకూడదు. ముఖ్యంగా నేరుగా మంట తగిలేలా ఫ్రై చేయకూడదు. 

వేయించిన నూనెను తిరిగి మళ్లీ ఉపయోగించడం కేన్సర్‌ను కోరి తెచ్చుకోవడమే. ఒకసారి వాడిన రిఫైన్డ్ ఆయిల్‌ను మరోసారి వినియోగించకూడదు.