మీ పిల్లల ఇమ్యూనిటీ పెరగాలంటే.. వీటిని తినిపించండి.. 

అరటి పండులో బీ6 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగాలంటే అరటి పళ్లు తినిపించాలి. 

మీ పిల్లల రోగనిరోధక శక్తి పెరగడానికి యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే బెర్రీ ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి. 

తీపి దుంపల్లో విటమిన్ బీ6, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. మీ పిల్లల ఇమ్యూనిటికి ఉపయోగపడతాయి. 

బ్రోకలి పోషకాల పవర్ హౌస్. ఇది పిల్లలకు చాలా మేలు చేస్తుంది. 

జింక్, విటమిన్ బీ6ను పుష్కలంగా కలిగి ఉండే శెనగలు ఇమ్యూనిటీని పెంచుతాయి. 

ఐరన్, జింక్‌తో పాటు పలు పోషకాలను కలిగి ఉండే రాజ్మా పిల్లలకు చాలా మేలు చేస్తుంది.

పిల్లల ఆహారంలో బచ్చలి కూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను భాగం చెయ్యాలి. ఇవి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. 

పిల్లలు జలుబు, ఫ్లూ జ్వరం బారిన పడినపుడు వెల్లుల్లి వేసిన ఆహారం తినిపించడం ఎంతో ఉత్తమం

జామ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.