ఈ మసాలా దినుసులు తింటే చాలు.. పొట్ట కొవ్వు తగ్గిపోతుందట..!

పొట్ట కొవ్వు తగ్గించడంలో భారతీయ వంటింట్లో కొన్ని మసాలా దినుసులు బాగా సహాయపడతాయి.

పసుపులో కర్కుమిన్ సమృద్దిగా ఉంటుంది.  ఇది కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.  జీవక్రియను పెంచుతుంది.

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు  బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.  ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మెంతులు ఆకలిని నియంత్రించి ఆహారం తక్కువ తీసుకునేలా చేస్తాయి.  బరువు తగ్గడానికి  సహాయపడతాయి.

ఎండుమిరపలో క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది.  శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది,  జీవక్రియను వేగం చేస్తుంది,  ఆకలి హార్మోన్ ను నియంత్రిస్తుంది.  

సాధారణం కంటే మూడురెట్లు ఎక్కువ కొవ్వు బర్న్ కావడానికి రోజూ టీస్పూన్ జీలకర్ర తీసుకోవాలి.  జీలకర్ర బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది.  

అల్లం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.  ఫ్యాట్ బర్న్ కావడంలో సహాయపడుతుంది.  

వాము ఆకులు శరీరంలో కొవ్వు సంశ్లేషణను నియంత్రించే ప్రోటీన్లు,  జన్యువులను ప్రభావితం చేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.