వేసవిలో ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. ఏసి  కూడా పనికిరాదు!

స్నేక్ ప్లాంట్.. ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి టాక్సిన్లను తొలగించడం ద్వారా ఇంట్లో గాలిని శుద్ది చేస్తుంది. రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. బెడ్ రూమ్ కు ది బెస్ట్ ఈ మొక్క.

కలబంద.. కలబంద గాలిని శుద్ది చేయడమే కాకుండా గాలి తాజాగా కూల్ గా ఉండేలా చేస్తుంది.

పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ గాలిలో ఉండే టాక్సిన్లను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.  గాలిలో తేమను జోడించి ఇంటి వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది.

బోస్టన్ ఫెర్న్.. ఫెర్న్ మొక్కలు అద్భుతమైన ఎయిర్ ఫ్యూరిఫైయర్లుగా పనిచేస్తాయి. ఇంటి  వేసవి వేడి గాలిని చల్లబరిచి వాతావరణం చల్లగా ఉండేలా చేస్తాయి.

స్పైడర్ ప్లాంట్.. గాలిలో ఉండే కార్భన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ లను తొలగించడంలో స్పైడర్ ప్లాంట్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. గాలిలో తేమను జోడించి ఇల్లంతా చల్లగా ఉండేలా చేస్తాయి.

అరెకా పామ్.. ఇంట్లో ఉండే గాలిలో టాక్సిన్లను తొలగించి గాలిని శుద్ది చేస్తుంది. గాలిలో తేమను నిలిపి ఉంచి ఇల్లంతా చల్లదనాన్ని ఇస్తుంది.

వెదురు పామ్.. వెదురు పామ్ మొక్కలు కాంతి తక్కువ ఉన్న పరిస్థితులలో పెరుగుతాయి. గాలి కాలుష్యాన్ని తొలగించి గాలి తాజాగా, చల్లగా ఉండేలా చేస్తాయి.

రబ్బర్ మొక్కలు.. రబ్బరు మొక్కలు గాలిలో టాక్సిన్లు తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి.