ఎక్కువ ఆలోచించకండి.. ఉదయాన్నే ఈ పనులు చేయండి.. 

ఉదయం లేవగానే ముందుగా ఓ గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి. 

ఉదయం తొలి ఆహారంగా నానబెట్టిన బాదం పప్పులను తింటే శరీరానికి తగినన్ని ప్రోటీన్లు అందుతాయి. చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. 

ఉదయం స్ట్రెచింగ్ వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. గట్ హెల్త్ మెరుగుపడుతుంది. 

ఉదయాన్నే ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం ఉత్తమం. మనసు మీద నియంత్రణ సాధన చేయాలి. 

ఉదయాన్నే పరగడుపుతో కాఫీ తాగే అలవాటును మానుకోవాలి. ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు దూరమవుతాయి. 

ఉదయాన్నే కొద్ది దూరం నడవడం చాలా మంచిది. రోజంతా పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. 

ఉదయాన్నే హై కేలరీ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. 

ఉదయం సమయంలో కాస్తంత యోగర్ట్, పెరుగు వంటి ప్రో బయోటిక్స్ తీసుకుంటే గట్ హెల్త్ మెరుగుపడుతుంది.