ప్రోటీన్ లోపం ఏర్పడితే శరీరం శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్చిన్నం చేస్తుంది. ఇది జీవక్రియను నెమ్మది చేసి శరీరంలో కొవ్వులు కరగకుండా చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది.
విటమిన్-డి లోపిస్తే శరీరంలో కొవ్వు మీద ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారాలు తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. కానీ ఫైబర్ తీసుకోకపోతే అతిగా తినడం, కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది.
మెగ్నీషియం లోపం ఏర్పడితే శరీరంలో కొవ్వు నిల్వలు పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఐరన్ లోపం ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువ. ఇది అలసటను కలిగిస్తుంది. శరీరంలో శక్తి తగ్గిస్తుంది.
జింక్ లోపం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. బరువు తగ్గాలనే ప్రయత్నాలకు అడ్డు కట్ట వేస్తుంది.
విటమిన్- బి12, బి6 శరీరంలో శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. బరువు పెరగడానికి దోహదపడతాయి.