అరెకా పామ్ కొద్దిగా కొబ్బరిచెట్టును పోలి ఉంటుంది. ఇంట్లో అయినా బయట అయినా సులువుగా పెరుగుతుంది.
స్నేక్ ప్లాంట్
పాములు రాకుండా ఉంటాయనే కారణంతో స్నేక్ ప్లాంట్ పెంచుతారు. ఈ మొక్కకు లోతైన ఆకుపచ్చ, పసుపు రంగులో పొడవుగా, మందంగా ఉన్న ఆకులుంటాయి.
స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్
ఈ మొక్కను ముత్యాల తీగ అంటారు. ఈ మొక్క తీగలో గుండ్రని పూస ఆకారంలో ఆకులు ఉంటాయి. వీటిని వేలాడే బుట్టల్లో పెంచితే భలే ఉంటుంది.
పీస్ లిల్లీ
పీస్ లిల్లీని బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే ఆకులు, తెల్లగా ఆకు రూపాన్ని పోలిన పువ్వులతో ఆహ్లాదంగా ఉంటుంది.
జెగోనియా
జెగోనియా మొక్క గులాబీ, ఎరుపు, తెలుపు, పసుపు, నారింజ రంగులలో కూడిన పువ్వులను పూస్తుంది. చాలా వేగంగా పెరుగుతుంది. బెడ్రూమ్ లోనూ, లివింగ్ రూమ్ లోనూ ఆహ్లాదాన్ని ఇస్తాయి.