ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందంటే..!

రోజుకు 8 గంటలు స్రీన్ ముందు కూర్చొనేవారు ఉంటారు.  ఇలాంటి వారికి ఈ 9 ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఒకేచోట కూర్చోవడం వల్ల  కండరాలు లిపోప్రోటీన్ లిపేస్  అణువులను విడుదల చేయవు.  దీని కారణంగా శరీరంలో చక్కెర, కొవ్వులు ప్రాసెస్ కావడం ఆగిపోతుంది.  బరువు పెరగడానికి దారితీస్తుంది..

ఒకేచోట ఎక్కువగా కూర్చోవడం వల్ల  డోపమైన్ హార్మోన్ సరిగా విడుదల కాదు.  ఇది ఒత్తిడి, ఆందోళన,  నిరాశ వంటి మానసిక సమస్యలు పెంచుతుంది.

శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు మధుమేహం వస్తుంది.  నిశ్చల జీవనశైలి ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి వెరికోస్ వెయిన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ కూర్చోవడం వల్ల శరీర కండరాలు బలహీనపడతాయి.  బరువును భరించే సామర్థ్యం తగ్గుతుంది. గాయాల ప్రమాదం పెరుగుతుంది.

సిట్టింగ్ వర్క్ చేసేవారికి మెడ భాగంలో నరాలు ప్రభావితమవుతాయి.

 శారీరక శ్రమ లేకపోవడం, రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపోటుకు ప్రధాన కారణమైన రక్తపోటు సమస్య వస్తుంది.